- ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యపు సమాధానాలు
- నీ దిక్కున్నచోట చెప్పుకోమని దబాయింపు
- డీఈఓ, డీపీఓల తీరు పై నిరసన
బతుకమ్మ, మాచారెడ్డి: మాచారెడ్డి మండల కేంద్రం లోని ప్రైవేట్ స్కూల్స్ రేకుల షెడ్స్ లో నడుపుతున్నారు. అందులో చదివే విద్యార్థులు ఎండ తీవ్రత ను భరించలేక పోతున్నారు. ఆ పాఠశాల యాజమాన్యం కు తగిన సూచనలు చేసి ఎండ నుంచి విద్యార్థుల కు రక్షణ చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి రాజు కు మాజీ ఎంపీటీసీ రావుల వినోద ప్రభాకర్ ఫోన్ లో ఫిర్యాదు చేశారు. మస్తు మంది ఇలాగే చెబుతారు. మేము ఏమి చేయ్యలేం. మీ ఇష్టమున్నది చేసికో అని దబాయించి ఫోన్ పెట్టేశాడు. ఒక జిల్లా స్థాయి అధికారి ఒక రాజకీయ నాయకుడికే జవాబుదారీతనం లేని సమాధానమిస్తే సామాన్య పౌరులను ఈ అధికారులు పరిగణనలోకి తీసుకుంటారా అని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా కామారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, గజ్యానాయక్ తండా మాజీ వార్డు సభ్యులు అజీజ్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు కు గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమాల పై ఫిర్యాదు చేశారు. ఫోన్ చేస్తే స్పందన లేదు. వాట్సాప్ లో రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్పందన లేదు. మండల స్థాయి అధికారుల తీరు సరేసరి. ఈ అధికారుల తీరు మారేదెప్పుడు….? సామాన్యులకు న్యాయం జరిగేదెప్పుడు…? అనే చర్చ స్థానికంగా జరుగుతుంది.