Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2025, 4:54 pm Posted by : ramakrishna

మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య

బతుకమ్మ, భిక్కనూరు: మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే బండి రాజు (35) హౌసింగ్, మైక్రో ఫైనాన్స్ అప్పు తీసుకోగా  ఫైనాన్స్ వారు నిత్యం వేధిస్తున్నారని భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీంతో వారి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్ఐ ఆంజనేయులు చేరుకొని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డికి ఏరియా దావఖానకు తరలించడం జరిగిందన్నారు.