Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 6:25 pm Posted by : ramakrishna

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని నల్లవెల్లి గ్రామంలో కోరట్పల్లి గ్రామానికి చెందిన  నీరడీ హేమలత(32)నల్లవెల్లి గ్రామానికి  చెందిన నీరడి గంగాధర్ తో వివాహం  అయినప్పటి నుండి తరచుగా భర్త గంగాధర్,అత్త ఎల్లవ్వ ఇద్దరూ మానసికంగా శారీరకంగా వేధిస్తూ అధిక  కట్నం తీసుకురమ్మని చెప్పి రోజు చిత్రవధ చేస్తుండేవారని  కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు.మృతురాలికి పిల్లలు లేకపోవడంతో హాస్పిటల్లో చూపించాలని డబ్బులు ఇవ్వమని భర్త గంగాధర్ వేధించేవాడన్నారు.మృతురాలి  తల్లిదండ్రులు రెండు మూడుసార్లు మాట్లాడి సర్ది చెప్పి ఇంటికి పంపించిన గాని మృతురాలి భర్త గంగాధర్ తన ప్రవర్తన మార్చుకోకుండా శుక్రవారం సాయంత్రం భార్యను ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో నుండి కాలకృత్యాలకు అని చెప్పి వెళ్లి గౌరారం శివారులో సాకి వాగు లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు  ఎస్సై తెలిపారు. మృతురాలి  కుటుంబ సభ్యుల ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేయనున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు.