Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 5:45 pm Posted by : ramakrishna

నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే..

  • రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇటుక బట్టీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు బిజేపి నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కొట్టిపారేశారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక నే ప్రతిపక్షాలు కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి విలేఖరులతో మాట్లాడుతు… ప్రాణహిత చేవెళ్ల 21 వ ప్యాకేజీ పనుల్లో డిజైన్ మార్పు ఉండదు అన్నారు. పాత డిజైన్ ప్రకారమే లిఫ్ట్ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. మంచిప్ప చెరువు కట్ట ఒక మీటర్ ఎత్తు పెంచే  అవకాశం ఉందని దాని ద్వార సమీప గ్రామాల భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని పనులు చేస్తారని అన్నారు. ఎత్తు పెంపు వల్ల గ్రామాలకు ఎలాంటి నష్టం ఉండదు అని తెలిపారు.  ప్రాణహిత చేవేళ్ల ప్యాకేజీ పనుల కోసం రూ. 6 వందల కోట్ల తో పనుల కోసం ప్రతిపాదనలు పంపామని త్వరలోనే నిదులు వస్తాయని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చబోము అని భూపతి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ జనరంజకమని ప్రశంసించారు. సీయం రేవంత్ రెడ్డి పాలన సబ్బండ వర్ణాలకు అమోదయోగ్య పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. ఈ విలేఖరుల సమావేశంలో మార్కెట్ కమిటి చైర్మెన్ ముప్ప గంగారెడ్డి, డిసిసి డేలిగేట్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గోన్నారు.

Unable to bear my political rise..1236