Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2024, 1:02 pm Posted by : ramakrishna

8 ఫీట్ల కన్నా ఎత్తుంటే ఉమ్మెడ గోదావరికే..


Ummeda Godavari belongs to Godavari if he is taller than 8 feet.

. గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై కలెక్టర్ సీపీ, సూచనలు

నిజామాబాద్, బతుకమ్మ: గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్ పలు సూచనలు చేశారు. 8ఫీట్ల కన్నా తక్కువ ఎత్తున్న విగ్రహాలను బాసర గోదావరి తరలించాలని, జాన్కంపేట్ రైల్వే గేటు వద్ద ఎలక్ర్టిక్ లైన్ ఉన్నందున 8ఫీట్ల పైబడి ఎత్తున విగ్రహాలను ఉమ్మెడ గోదావరికి తరలించాలని పేర్కొన్నారు. నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి బ్రిడ్జికి గణేశ్ విగ్రహాలను తరలించే వారు కంఠేశ్వర్, బైపాస్ చౌరస్తా, మానిక్ బండార్, మాక్లూర్, ఆంధ్రనగర్, నందిగుట్ట నందిపేట మీదుగా ఉమ్మెడ గోదావరి బ్రిడ్జికి చేరుకుని విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు.