Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 5:24 pm Posted by : ramakrishna

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉమారాణి

 

. . . వైస్ చైర్మన్‌గా కాసర్ల గోదావరి ఎన్నిక

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా ఇప్ప ఉమారాణి, వైస్‌ చైర్మన్‌గా కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి కాగా కౌన్సిలర్ల సోమవారం ప్రమాణస్వీకారం నిర్వహించారు. అనంతరం చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను అధికారులు చేపట్టారు. కాగా 49వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఇసాక్ షేరు మున్సిపల్ చైర్ పర్సన్ గా స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి పేరును ప్రతిపాదించగా 29వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ అంజాద్ బలపరిచారు. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్ నుంచి 19 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నుంచి 11 మంది, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు చేయి లేపి ఓటు వేశారు. అలాగే బీజేపీ అభ్యర్థికి ఎమ్మెల్యే సహా బీజేపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఇప్ప ఉమారాణి చైర్ పర్సన్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరిని 45వ వార్డు కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్ ప్రతిపాదించగా 18 వ వార్డు కౌన్సిలర్ బలపరిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో కాసర్ల గోదావరి వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లతో ప్రమాణస్వీకారం చేయించారు.

 

 

Umarani elected as Kamareddy Municipal Chairman