Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 10:56 am Posted by : ramakrishna

నిజామాబాద్ మేయర్ గా ఉమారాణి 

… ఖరారు చేసినట్టు సమాచారం

 

… కౌన్సిల్ సమావేశంలో ప్రకటనే తరువాయి

 

 నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ మేయర్ గా 49 డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలిసింది.. మరీ కొన్ని గంటలలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పేరు ను ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్, జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతి రెడ్డి ల ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో ఎక్కభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. నిజామాబాదు మేయర్ స్థానం మహిళ జనరల్ కు కేటాయించాగా కాంగ్రెస్ తరుపున ఐదుగురు మహిళ కార్పొరేటర్ లు గెలిచారు. అందులో ముందుగా పూజిత ప్రవీణ్ గౌడ్, పంచరెడ్డి లలిత, ఉమారాణి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే బీసీ లలో ముదిరాజ్ సామజిక వర్గానికి ఇప్పటి వరకు అవకాశం దక్కక పోవడం తో అకోటాలో ఉమా రాణి కీ కలిసి వచ్చింది. కూరగాయల ఉమారాణి భర్త కరాటే రమేష్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు ముఖ్య అనుచరుడు కావడం తో ఈ పదవి దక్కింది.

Umarani as Mayor of Nizamabad

కాంగ్రెస్ పార్టీ తొలిసారి మేయర్ అభ్యర్థి గా శమంతా పేరు ఖరారు చేసి బరిలో నిలిపిన ఆమె ఓటమి పాలు కావడం ఉమారాణి కి కలిసి వచ్చింది. ఉమారాణి మొన్నటి వరకు సాధారణ గృహిణి. ఇప్పుడు కాలం కలిసి రావడం తో నగర ప్రథమ పౌరురాలు అయింది. నిజామాబాద్ నగర మేయర్ గా తన అనుచరులకు ఇప్పించుకునేందుకు పీసీసీ చీఫ్ ప్రయత్నం తన సహచరుడు రమేష్ సతీమణి కి ఇప్పించి తన మాట నెగ్గించుకున్నారు.. నిజామాబాద్ డిప్యూటీ మేయర్ పదవి మజ్లిస్ కు కేటాయించగా 54 వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్ ను అపార్టీ ఎంపిక చేసింది. సోమవారం నాటి కౌన్సిల్ సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎంపిక లాంచినమే. కొత్త పాలక వర్గం కొలువు దిరటం మరికొన్ని గడియల్లో జరుగుతుంది.

Umarani as Mayor of Nizamabad