ఫ్యూచర్ లైన్ స్కూల్‌లో ఘనంగా యూకేజీ చిన్నారుల గ్రాడ్యుయేషన్ వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ఫ్యూచర్ లైన్ స్కూల్‌లో యూకేజీ పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు గ్రాడ్యుయేషన్ దుస్తుల్లో స్టేజ్‌పై సర్టిఫికేట్లు అందుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను అలరించాయి. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లావణ్య, సంధ్య, గౌతమి, మీనాక్షి, శిరిష, సిబ్బంది పాల్గొన్నారు....