Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2025, 7:09 pm Posted by : ramakrishna

కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలు చేయాలి

  • తెలంగాణ విశ్వవిద్యాలయం అధ్యక్షులు డాక్టర్ వి.దత్తహరి

నిజామాబాద్, బతుకమ్మ : యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులకు  యూజీసీ పే స్కేల్స్ అమలు చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయం అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్  కాలేజీ ,దక్షిణ ప్రాంగణం, సారంగాపూర్ ప్రాంగణం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు సమావేశం సెమినార్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న 1445 మంది ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రతతో కూడిన బేసిక్, డిఎ, హెచ్ఆర్ఎ, 3శాతం ఇంక్రిమెంట్  ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 15 సంవత్సరాల నుండి యూనివర్సిటీ నమ్ముకొని పనిచేస్తున్నామని, తమని రెగ్యులరైజ్ చేయటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధనంగా ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదని తెలిపారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ, రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కోరికలను తీర్చడానికి ఉన్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని, హామీని నిలబెట్టుకుని  తమకు న్యాయం చేయాలపి కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దేవరాజ్, శ్రీనివాస్, డాక్టర్ జలంధర్, నరసయ్య, డాక్టర్ రామేశ్వర్ రెడ్డి, డాక్టర్ గంగ కిషన్, ఉపాధ్యాయ బృందాలు పాల్గొన్నారు.