కలెక్టరేట్ లో ఉగాది పంచాంగ శ్రవణం
కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా టీఎన్జీవోస్, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయముంలో వేద పండితులు శ్రీ ఆంజనేయ శర్మ ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈకార్యక్రమం జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సరం లో రాష్టం, కామారెడ్డి జిల్లా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. ఒడిదొడుకులు ఉన్న పాలనాపరమైన ముందు చూపుతో సమస్యలు తొలగుతాయన్నారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ శుభాలను తీసుకురావాలని జిల్లా ప్రజలకు...