Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 March 2025, 8:10 pm Posted by : ramakrishna

కలెక్టరేట్ లో ఉగాది పంచాంగ శ్రవణం

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా టీఎన్జీవోస్, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయముంలో వేద పండితులు శ్రీ ఆంజనేయ శర్మ ఉగాది  పంచాంగ శ్రవణం చేశారు. ఈకార్యక్రమం జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సరం లో రాష్టం, కామారెడ్డి జిల్లా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. ఒడిదొడుకులు ఉన్న పాలనాపరమైన ముందు చూపుతో సమస్యలు తొలగుతాయన్నారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ  విశ్వావసు నామ సంవత్సరం అందరికీ శుభాలను తీసుకురావాలని జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పండితులు ఆంజనేయ శర్మ  మాట్లాడుతూ కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు  జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. మహిళా పండితులతో పంచాంగా శ్రవణం మొట్టమొదటి సారిగా  కామారెడ్డి లో నిర్వహించమన్నారు.  అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, నరాల వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవేందర్, సాయి రెడ్డి,  టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎం నాగరాజు, సహధ్యక్షులు ఎం చక్రధర్, కోశాధికారి ఎం దేవరాజు,  ఉపాధ్యక్షులు లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ గణేష్,  కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.