భీమ్ గల్, బతుకమ్మ : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిర్వహించిన ఆధ్యాత్మిక కవి సమ్మేళనంలోకవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ కు ఉగాది పురస్కారం లభించింది. బోర్గాం(పి) గ్రామానికి చెందిన శ్రీ శృంగేరి శారదాపీఠ అనుబంధ ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి మహలయములో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కవి సమ్మేళనం లోకంకణాల యుగయుగల ఉగాది అనే తన కవితను చదివి వినిపించారు. సభికులను అలరించిన ఆయన కవితకు గాను ఆయనకు ముఖ్య అతిథి, జిల్లా విద్యాధికారి పార్శి అశోక్ ఉగాది పురస్కారం తో పాటు జ్ఞాపికను అందజేసీ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ టి. అరుణ్ కుమార్ శర్మ, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు, చింతల శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ కవులు డాక్టర్ బలాష్ట్ మల్లేష్, కె.వి.రమణాచారి, పాత్రికేయ కవులు బట్టు శ్రీధర్ రాజు, జనగామ చంద్రశేఖర్ శర్మ, తొగర్ల సురేష్, చిలుక అరుంధతి, ఇప్పకాయల సుదర్శన్, రివర్స్ గేర్ నవీన్, పురం సుధాంష్ 50 మంది కవులు, కవయిత్రులు ప్రభృతులు పాల్గొన్నారు.