ఉగాది, రంజాన్ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ఉగాది, రంజాన్ పండుగలను హిందువులు, ముస్లింలు మతసామరస్యాల కనుగుణంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో హిందూ, ముస్లిం సోదరులతో స్థానిక ఎస్సై మల్లారెడ్డి అధ్యక్షతన శాంతి సమావేశం నిర్వహించారు. సిఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయం వద్ద జరిగే ఎడ్లబండ్ల ఊరేగింపు, బోనాల పండుగ, రథోత్సవం సందర్భంగా ఎలాంటి అల్లర్లు, ఘర్షణలకు తావివ్వకుండా మతసామరస్యంగా, శాంతియుతంగా...