మహిళా ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్
హైదరాబాద్, బతుకమ్మ : మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి చేసిన ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ) ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఎన్‌పీఏ అధికారికంగా వెల్లడించింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు ఏర్పాటు చేసిన ప్రివిలేజ్ కమిటీ కేసుపై సమగ్ర విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్‌లు, సంబంధిత ఆధారాలను పరిశీలించిన కమిటీ, వేధింపులకు సంబంధించిన ఆరోపణలు నిజమేనని నిర్ధారణకు వచ్చినట్లు...