నిజాంసాగర్ కాలువలో ఇద్దరు యువకుల గల్లంతు
బాన్సువాడ, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం జక్కలదాని తండా గ్రామ శివారులో నిజాంసాగర్ కాలువలో శనివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. హన్మాజీపేట్ గ్రామపంచాయతీ లోని సంగ్రామ్ నాయక్ తండాకు చెందిన ఇద్దరు యువకులు సిద్దు, రాజు ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడ్డి గల్లంతయ్యారు. అటుగా వెళుతున్న ఉపాధి హామీ కూలీలు గమనించి రాజును కాపాడారు. సిద్దు ఆచూకీ లభ్యం కాలేదు.