Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 10:00 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

బతుకమ్మ, జక్రాన్ పల్లి: జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌ వద్ద మంగళవారం 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు జక్రాన్పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన సందీప్‌ (21), ప్రమోద్‌ (22) బైకుపై ఆర్మూర్‌కు వచ్చారు. సాయంత్రం డిచ్‌పల్లి మీదుగా నిజామాబాద్‌కు బయలుదేరారు. బైకుపై వెళ్తుండగా సికింద్రాపూర్‌ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.