బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మోర్తాడ్ ఎస్సై విక్రం తెలిపిన వివరాల ప్రకారం….. సోమవారం మధ్యానం మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ సోహెల్, మహమ్మద్ సుమెర్ లు రాయల్ ఎన్ఫీల్డ్ టీఎస్ 21 ఏ 2004 గల దానిపై మహమ్మద్ సోహెల్ యొక్క పాత ఇంటి నుండి కొత్త ఇంటికి వెళుతుండ, మార్గ మద్యలో తిమ్మాపూర్ లోని జ్ఞానోదయ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఇనుప స్తంబమును ఢీకొట్టారు. అజాగ్ర్తత్తగా నడిపి విద్యుత్ స్తంభం కు టక్కరివ్వగా వారికి బలమైయన గాయాలయి ఘటన స్థలంలోనే ఇద్దరు చనిపోయారు. సోహెల్ భార్య మహమ్మద్ రజియా ఇచ్చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్టు మోర్తాడ్ ఎస్‌ఐ బి.విక్రమ్ తెలిపారు.
