యూరియా బస్తాను ఎత్తుకెళ్లిన ఇద్దరు యువకులు
వాట్సప్ గ్రూపులలో వైరల్ కావడంతో తిరిగి అప్పగింత బతుకమ్మ, భిక్కనూరు : పంట చేనులో ఉన్న యూరియా బస్తా ను రైతు కళ్లు కప్పి ఇద్దరు యువకులు ఎత్తుకెళ్లిన విచిత్రమైన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుడు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తక్కల్ల గంగారెడ్డి తన వ్యవసాయ పొలంలోని మొక్కజొన్న పంటకు వేయడానికి యూరియా బస్తాలను తన వ్యవసాయ బావి వద్ద ఉంచాడు. ఆ బస్తాలను రైతుకు...