దొంగలు అనుకుని ఇద్దరు యువకులపై దాడి

భిక్కనూర్, బతుకమ్మ : దొంగలు అనుకుని ఇద్దరు యువకులపై దాడి చేసిన ఘటన భిక్కనూరు మండలం బస్వాపూర్ లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామంలోకి వేర్వేరుగా వచ్చిన ఇద్దరు యువకులను గ్రామస్తులు ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. ఓ యువకుడు కామారెడ్డి లోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తొందరపడి దాడులకు పాల్పడొద్దన్నారు. స్థానికులు, యువత సమన్వయం పాటించాలని...