Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2024, 11:10 pm Posted by : ramakrishna

రెండేళ్లాయే.. రూ.2 లక్షలు ఇవ్వకపాయే..

  • గుంజిలి జిపి నుంచి క్రీడా ప్రాంగణం కోసం
  • మెటీరియల్ పేమెంట్ రాగానే చెల్లింపులు
  • మంజూరైన ఇవ్వకుండా బుకాయింపులు
  • మాక్లూర్ మండలాధికారి పరిస్థితి ఇది

నిజామాబాద్ బతుకమ్మ : ప్రస్తుతం ఉన్న మండల అధికారి హయాంలో మాక్లూర్ మండలం చరిత్ర సృష్టిస్తోంది. ఇటీవల 15 రోజులు సెలవులో వెళ్ళినా ఇంకొకరికి ఇన్చార్జి ఇవ్వకపోవడం ఒకటయితే, జిపి నుంచి రూపాయిలు రెండు లక్షలు తీసుకొని రెండేళ్లు అయినా ఇప్పటికీ ఇవ్వకపోవడం.
(ఎండిఓ కాంట్రాక్ట్ అవతారం.. అర్బన్ పార్క్ గురించి త్వరలో )

రెండేళ్లయినా…

పైసా మీద కక్కుర్తి పడిన ఆ అధికారి సందు దొరికితే మింగేసేలా తయారయ్యింది. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం నిర్మించాలని అప్పటికి తెరాస ప్రభుత్వం ఆదేశించింది ఆయా గ్రామాలలో సర్పంచులే వీటి పనుల నిర్వహణను చూడాల్సి ఉంటుంది. తాను గుత్తేదారుని రూపంలో పనులు చేయిస్తానని పలు గ్రామాల సర్పంచులను మాక్లూర్ మండల అధికారి అడిగారు. తమ పనులు తామే చేసుకుంటామని కరాకండిగా పాలకులు చెప్పేశారు. మండలంలోని అన్ని గ్రామ సర్పంచులను అడిగితే చివరకు గుంజలి గ్రామపంచాయతీ ఎండిఓ వేసిన గాలానికి పడింది. మెటీరియల్ పేమెంట్ పడగానే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి క్రీడా ప్రాంగణం నిర్మాణం కోసం అని పోస్ట్ టు రియంబర్స్మెంట్ పేరిట రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు.

పేమెంట్ రాగానే చెల్లింపులు..

తమ పై అధికారి అని సంకోచిస్తూనే జీపీ నిదులను పాలకులు ఎండిఓ చేతిలో పెట్టారు. ఉపాధి హామీ నిధులు మంజూరు కాగానే చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లిస్తానని మాట ఇచ్చారు. నిధులు మంజూరయ్యాయిగా డబ్బులు ఇవ్వండి అని పాలకులు పదేపదే పలుమార్లు అడిగారు. ఇదిగో అదిగో అంటూ కాలం వెలదీస్తూ రాగానే వారి పదవి కాలం కాస్త పూర్తయింది.

ఇవ్వకుండా బుకాయింపులు

ఎండిఓ తీసుకున్న అప్పు వసూలు చేసేందుకు ప్రస్తుతం గ్రామ కార్యదర్శి పై పడింది. గ్రామపంచాయతీలో ఉండే డబ్బులే కదా… ఇవ్వకపోయినా ఏం కాదులే అనుకుంటున్నారేమో కాబోలు… అందుకేనేమో అప్పుడు పాలకులు, ఇప్పుడేమో కార్యదర్శి జిపి కి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని ప్రాధేయపడితే ఇవ్వకుండా బుఖాయించుకుంటూ వస్తున్నారు.