Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 January 2025, 9:27 pm Posted by : ramakrishna

పోలీసు విధులను అడ్డుకున్న నలుగురికి రెండేళ్ల జైలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

గుడుంబా కాస్తున్నరనే సమాచారం మేరకు అక్కడకు వేళ్లిన పోలీసులను అడ్డుకున్న నలుగురికి న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష, జరిమాన విధించింది. మోపాల్ మండలం శ్రీరాం నగర్ తాండాలో 2017 లో  కేతావత్ గోకుల్, గుగూలోత్ దేవేంధర్, కేతావత్ లక్ష్మి బాయ్, కేతావత్ తిరుపతిల ఇంటివద్ధ సారా కాస్తున్నరని విశ్వసనీయ సమాచారం మోపాల్ పోలిసులకు అందింది. దానితో అప్పటి ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి వేళ్లగా ఆ నలుగురు పొలీసు విధులను అడ్డుకుని న్యూసెన్స్ చేశారు. దానితో మోపాల్ పోలీస్ స్టేషన్ లో నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. ఈ కేసులో గురువారం అధనపు జూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  పి శ్రీనివాస్ రావు నలుగురికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, రెండు వేల చోప్పున జరిమాన విధిస్తు తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించాలని లేని ఎడల రెండు వారాల సాధరణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెలువరించారు.