Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2024, 4:23 pm Posted by : ramakrishna

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఒకరిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం.. మాక్లూర్ మండలం మామిడి పల్లి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కరిపే సుమన్ దుబాయ్ నుంచి తిరిగివచ్చాడు. తాగుడు, జల్సాలకు అలవాటు పడి నిజామాబాద్, కోరుట్ల, నవీపేట్ మండలాల్లో తిరుగుతూ ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని అమ్మి జల్లాలు చేసేవాడు. దొంగిలించిన వాహనాన్నిఅమ్మడానికి వెలుతుండగా పట్టకొని విచారించగా తాను బైక్ లు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలు రికవరీ చేశారు.