Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2025, 7:40 pm Posted by : ramakrishna

విద్యుదాఘాతంతో ఇద్దరికి తీవ్ర గాయాలు

  • విద్యుత్ ఆపరేటర్ నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబీకులు
  • తమకేమీ తెలియదంటున్నవిద్యుత్ శాఖ అధికారులు

 

రాజంపేట, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒకరి రైస్ మిల్ లో కరెంటు రావడం లేదని ట్రాన్స్ఫార్మర్ వద్ద కట్ పాయింట్ పెట్టాలని బీరయ్యను బతిమాలాడు. బీరయ్య మరో వ్యక్తి తో కలిసి ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సబ్ స్టేషన్ లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న ఒకరికి సమాచారం అందించారు.  అతను సబ్ స్టేషన్ కు సమాచారం అందజేసి విద్యుత్ సరఫరాణం నిలిపివేశారు. అయితే విద్యుత్ ఆపరేటర్ నిర్లక్ష్యంతో సిద్ధాపూర్ లైను వేయాల్సింది పోయి కొండాపూర్ లైన్ వేయడంతో విద్యుత్ షాక్ తగిలి బీరయ్య, మరోకరు అక్కడికక్కడే కింద పడిపోయారు. గమనించిన స్థానికులు మళ్లీ సబ్ స్టేషన్ కి సమాచారం ఇచ్చి విద్యుత్తును నిలిపివేశారు. గాయపడ్డ వారిని కామారెడ్డి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులకు వివరణ కోరగా తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఏం జరిగింది.. ఎలా జరిగిందనేది.. వివరాలు తెలుసుకొని చెప్తామని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు.

Two were seriously injured due to electric shock