Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2025, 3:25 pm Posted by : ramakrishna

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ

  • పలువురికి గాయాలు

 

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో మంగళవారం ఎదురేదురుగా వస్తున్న డీసిఎం వాహనం, కారు రెండు వాహనాలు ఢీ కొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న డిసిఎం TS08UK1598 వాహనం, బడాపహాడ్ నుండి లాతూర్ వైపు వస్తున్న  MH02BT7602 నెంబర్ గల వెగ్నర్ కారు రెండు వాహనాలు అక్బర్ నగర్ జాతీయ రహదారి పై ఎదురేదురుగా ఢీ కొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Two vehicles coming towards each other collided