బతుకమ్మ: బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని పత్లాపూర్ నుండి కందర్ పల్లి గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు రెండు మొరం టిప్పర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే శేట్లూర్ గ్రామం మంజీరా నది నుండి షేక్ అప్సర్ అనే వ్యక్తి బొలెరో ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం అందడంతో అట్టి బొలెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలియజేశారు.
