6వ టౌన్ ఏరియాలో రెండిళ్ళలో చోరీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వారం రోజులు గడువకముందే చోరీలకు తెగబడ్డారు. 6వ టౌన్ పరిధిలోని ధర్మపురి హిల్స్ , రంజానిబాబా దర్గా ప్రాంతంలోని షేక్ వసీం అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బంధువుల ఇంట జరిగే పెండ్లీ కోసం ఇంటికి తాళం వేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. వసీం ఇంట్లో రూ.3 లక్షల వరకు...