Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2024, 1:33 pm Posted by : ramakrishna

హత్య కేసులో ఇద్దరికి జీవిత కారాగార శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మహిళ హత్య కేసులో మరో మహిళతోపాటు ఓ వ్యక్తికి జీవిత కారాగార శిక్ష విధిస్తూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాలను నివారించే ప్రత్యేక న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి శ్రీనివాస్ మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జేకే తండాకు చెందిన అరుణ అనే మహిళతో ముదెల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల అంజయ్య కు వివాహేతర సంబంధం ఉందని, అతడి భార్య కాశమణి కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలిపింది. అయినప్పటికీ అరుణ, అంజయ్య వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. దీంతో తన కుటుంబం ఆర్థికంగా, కుటంబపరంగా నష్టపోతోందని భావించిన కాశమణి అరుణను హత్య చేయాలని భావించి తన గ్రామానికి చెందిన సుతారి చిన్న బాలయ్య సాయం కోరింది. తనకు రూ.5వేలు ఇస్తే సహకరిస్తానని అన్నాడు. పతకం ప్రకారం 2019 ఆగస్టు 29న హత్య చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేయగా, న్యాయస్థానం ఇద్దరికి జీవితకారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.