Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 8:36 pm Posted by : ramakrishna

కులంపేరుతో దూషించిన ఇద్దరికి ఐదేళ్ల కఠిన జైలుశిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పెద్దపల్లి జిల్లా జూలపల్లి గ్రామానికి చెందిన గొంగల్ల భవాని, అదే జిల్లా చెందిన చొప్పదండి మండలం రేవల్లి గ్రామానికి వాస్తవ్యుడు వంగపల్లి వెంకటయ్య లకు షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టంలోని మూడు సెక్షన్ల ప్రకారం ఐ దేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష, ఇండియన్ పినల్ కోడ్ లోని ఒక సెక్షన్ ప్రకారం ఒక్కొరికి రెండేళ్ల చొప్పున సాదారణ జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ జిల్లా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ శుక్రవారం తీర్పు చెప్పారు.నేర న్యాయ విచారణ అనంతరం కోర్టు వెలువరించిన ముప్పై ఆరు పేజీల తీర్పులోని వివరాలు….నిజామాబాద్ జిల్లా పెర్కిట్ గ్రామానికి చెందిన మేకల సురేష్ కు, పెద్దపల్లి జిల్లాకు చెందిన భవాని, వెంకటయ్య లకు వ్యక్తిగత పరిచయం ఉంది.పెద్దపల్లి జిల్లా జూలపల్ల గ్రామంలో వారికి శేషరత్నం ఎల్. పి. జి గ్యాస్ డిస్టిభ్యుషన్ షిప్ కలదు.వారి ఆర్థిక అవసరాలరీత్యా యాభై లక్షల రూపాయలు అప్పుగా ఇవ్వాలని సురేష్ ను కోరారు. చాలాసార్లు వారు కోరడంతో తన పేరున అప్పు వేరేవాళ్ళ దగ్గర తీసుకొని వారికి పెర్కిట్ లోని తన నివాసమైన విజేత అపార్టుమెంట్ లోని ప్లాట్ లో నగదు యాభై లక్షల రూపాయలు 2జులై, 2016న ఇచ్చాడు.ఏళ్ళు గడుస్తున్నవడ్డీ, అసలు ఇవ్వకపోవడంతో వారిని పెర్కిట్ గ్రామానికి రమ్మనగా వారు పెర్కిట్ బస్ స్టేషన్ దగ్గరకు 30సెప్టెంబర్, 2018న వచ్చారు. డబ్బుల విషయంలో నీలదీయడంతో భవాని ఇచ్చిన రెండు బ్యాంకు చెక్కులు 37 లక్షలకు ఇచ్చింది. అవి బ్యాంక్ నందు చెల్లకుండా పోయాయి. ఈ విషయంలో సురేష్ పట్టుబట్టడంతో అతనితో గొడవపడి,దూశించి, భూతు మాటలు తిడుతు,చెప్పుతో కొడతామని బెదిరించి,కులం పేరుతో దూశించి, చంపుతామని బెదిరించారనే నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో ఇద్దరికి ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 506 ప్రకారం రెండేళ్ల సాదారణ జైలుశిక్ష తో. పాటు వేయి రూపాయల జరిమానా, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం లోని మూడు సెక్షన్ ల ప్రకారం ఐదేళ్ల చొప్పున ఒక్కొక్కరికి కఠిన కారాగార శిక్ష తో పాటు వేయి రూపాయల చొప్పిన జరిమానా విధించారు.శిక్షలన్ని ఏక కాలంలో అనుభవించాలని స్పెషల్ జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో పేర్కొన్నారు.కోర్టు జారీ చేసిన కన్వీక్షన్ వారంట్ తీసుకున్న ఆర్మూర్ పోలీసులు ఇద్దరిని నిజామాబాద్ కేంద్ర కారగారానికి తరలించారు.