మెండోరా, బతుకమ్మ : మెండోరా మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై నారాయణ తెలిపారు. బుధవారం రాత్రి సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు పెద్ద వాహనాలను ఆయన పట్టుకున్నట్టు పేర్కొన్నారు. అనంతరం వాటిని మైంన్స్ అండ్ మినరల్ నిజామాబాద్ శాఖకు పంపించినట్లు ఎస్సై వెల్లడించారు.