రెండు ప్రాజెక్టులు నిండాయి
లక్షల క్యూసెక్కుల వరద గేట్లన్నీ ఎత్తి లక్ష క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీరందించే నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండాయి. వర్షాకాలంలో పొరుగున ఉన్న మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు రెండు ప్రాజెక్టులు ఆదివారం రాత్రి వరకే నిండిపోయాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరందించే నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం రాత్రి రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు...