Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 10:32 pm Posted by : ramakrishna

జీజీహెచ్ లో ఇద్దరు పీజీ వైద్యులకు కరోనా

 నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఇద్దరు పీజీ వైద్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ  మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు వైద్యులకు కొన్నిరోజుల క్రితం ప్లూ లక్షణాలు ఉండటంతో ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించడంతో పాజిటివ్ అని తేలింది. దానితో వారిద్దరు క్వారంటైన్ లో వైద్య సేవలందుకుని కోలుకున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రొ.శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల ఉత్తర మండలం ఒక పాజిటివ్ కేసు తరువాత ఇద్దరు వైద్యులకు పాజిటివ్ రావడం పట్ల వైద్య ఆరోగ్యశాఖ, జీజీహెచ్ అధికారులు అలర్ట్ అయ్యారు.