Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2025, 7:22 pm Posted by : ramakrishna

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

. . .  8 మందికి తీవ్ర గాయాలు

 కోరుట్ల, బతుకమ్మ:

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలో విద్యుత్ శాఖ లో ఘోర ప్రమాదం జరిగింది. విగ్రహాల తయారీ దారులు భారీ వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి 10 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం నిజామాబాద్- మెట్ పల్లి ప్రధాన రహదారిపై  జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ప్రాణాలకు తెగించి విద్యుత్ తీగలను తగ్గించడంతో పాటు విద్యుత్  శాఖాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు  విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఇద్దరు మృతి చెందినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది.