Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 6:43 pm Posted by : ramakrishna

మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు

 

.. ముగ్గురికి 33000 జరిమానా

ఇందల్వాయి,బతుకమ్మ :

సవరించిన మోటార్ వేహికిల్ అమెండమెంట్ యాక్ట్ కేసులో పట్టుబడిన ఇద్ధరికి న్యాయస్థానం జైలు శిక్ష, ముగ్గురికి భారీ జరిమానా విధించారని ఇందల్వాయి ఎస్ఐ సందిప్ తెలిపారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని రెండు రోజుల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మేఘ్య నాయక్ తాండకు చెందిన కాట్రోత్ రవి , పాటి తాండా లావుడ్యా నర్సయ్య అనే ఇద్దరిని ఈరోజు కోర్టులో హాజరుపరచగా సెకండ్ క్లాస్  మెజిస్ట్రేట్ స్పెషల్ ఎక్సైజ్ కోర్టు జడ్జీ జైలు శిక్ష విధించారని తెలిపారు. రవికి 7 రోజులు జైలు శిక్ష, నర్సయ్యకు 4 రోజుల జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు.మరొక ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 11, 000 చొప్పున మొత్తం 33, 000వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని జి ఎస్సై సందీప్ తెలిపారు.  తాగి వాహనాన్ని నడపడం చట్టరీత్యా నేరం కావున తాగి వాహనాలు నడపొద్దని తెలిపారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదని ఎస్సై జి సందీప్ తెలిపారు.