మెండోరా, బతుకమ్మ
మద్యం సేవించి వాహనం నడిపినందుకు ఇద్దరు వ్యక్తులకు నాలుగు రోజులు జైలు శిక్ష విధించినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మెండోరా గ్రామానికి చెందిన బేగారి రవి, నిర్మల్ కి చెందిన బాలకిషన్ అను వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడిపి పట్టుపడగా అట్టి వ్యక్తులను సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందర ప్రవేశపెట్టగా మేజిస్ట్రేట్ వారికి 4 రోజూలు జైలు శిక్ష విధించినట్లు మెండోరా ఎస్సై పేర్కొన్నారు.
