Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 10:19 pm Posted by : ramakrishna

అంతర్రాష్ట్ర దొంగల ముఠాకి చెందిన ఇద్దరు అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా కి చెందిన ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర,నాందేడ్ జిల్లా, నర్సి పట్టణానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్, షేక్ వాజిద్ అనే ఇద్దరు వ్యక్తులు గత రెండున్నర మూడు సంవత్సరాల నుండి కామారెడ్డి పట్టణంలో, దేవనపల్లి ఏరియాలలో వివిధ ఇండ్లలో దొంగతనాలు చేస్తూ, దొంగతనం చేసిన సొత్తుని దెగ్లూర్ ఏరియా లో వ్యక్తులకు అమ్మినారని, దాదాపుగా 30-40 ఇండ్లలో తాళం పగలగొట్టి దొంగతనాలు చేసినట్టుగా ఒప్పుకున్నారు. శనివారం ఉదయం కామారెడ్డి కి దొంగతనం చేయడానికి వచ్చిన వీరిని, రైల్వే స్టేషన్ ఏరియా లో పట్టుకున్నారు.  దొంగతనం చేసిన నగలను రికవరీ, మిగతా వారిపై తదుపరి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దొంగలని పట్టుకోవడం లో కామారెడ్డి సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ ఉస్మాన్, సిబ్బంది సురేందర్, రవి, గణపతి, శ్రవణ్, రాజేందర్, కిషన్ లు, పట్టణ సీఐ, రూరల్ సీఐ, రూరల్ ఎస్ఐ లు, సిబ్బంది కష్టపడి, ఆధారాలతో సహా పట్టుకోవడం జరిగింది వీరిని జిల్లా ఎస్పీ, ఏఎస్పీ అభినందించారు.