Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 5:12 pm Posted by : ramakrishna

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఖాకీలు

 

పోలవరం, బతుకమ్మ :

 

పోలవరం జిల్లాలోని గంగారం పీఎస్ లో ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తన భర్త వేరే మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శివ మొదటి భార్య గంగారాం పీఎస్ లో కేసు పెట్టింది. దాంతో ఈ కేసు నుండి తనని తప్పించాలని శివ స్టేషన్ ఎస్సైని కోరగా అతను రూ.20000 డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం విషయం తెలిసిన ఏసీబీ అధికారులు పోలిస్ స్టేషన్ కి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు లను పట్టుకున్నారు.