డ్రంక్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
నిజామాబాద్, బతుకమ్మ : డ్రంక్ డ్రైవ్ కేసులో కోర్టు ఇద్దరికి జైలు శిక్ష విధించిందని వన్ టౌన్ ఎస్సై రఘుపతి తెలిపారు. నగరంలో వన్ టౌన్ పరిధిలో పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పర్చమన్నారు. వారిలో ఒకరికి ఒకరోజు జైలు, మరొకరికి రెండు రోజల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు. ఈమేరకు వారిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.