Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 11:13 am Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

. ధాన్యం కుప్పను ఢీకొట్టిన బైక్

బాన్సువాడ, బతుకమ్మ : ధాన్యం కుప్పను బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి బీర్కూర్‌కు చెందిన రాము, అశోక్ ద్విచక్ర వాహనంపై బాన్సువాడ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా కిష్టాపూర్ వద్ద రోడ్డుపై పోసిన ధాన్యం కుప్పను ఢీకొన్నారు. ప్రమాదంలో రాము తలకు గాయాలుకాగా, చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.