రెండు సబ్ స్టేషన్ లలో ఇద్దరే..

అంత్యక్రియలకు అనుమతి ఇవ్వలేదు సెలవు ఇవ్వరు – ప్రత్యామ్నాయం చూపరు ఫోన్లు ఎత్తరు, పట్టించుకోరు మోర్తాడ్ సబ్ డివిజన్ లోని అధికారుల తీరిది   నిజామాబాద్, బతుకమ్మ: సార్ మా అమ్మమ్మ చనిపోయింది. చివరి చూపు కోసం వెళ్తాను, సెలవు ఇవ్వండి అని సబ్ స్టేషన్ లో పని చేసే అర్టిజన్ ఏఈకి పలుమార్లు ఫోన్ చేసాడు. అటు నుంచి సమాధానం లేదు సరిగదా సెలవు సైతం లేదు ..చేసేదిలేక కన్నీళ్ళపర్యంతమై మౌనంగా రోదిస్తూ విధులు నిర్వహించుకున్నాడు. కనీసం దినకర్మకైనా వెళ్తాను అని వేడుకోగా చివరకు...