Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 5:06 pm Posted by : ramakrishna

విద్యుదాఘాతంలో ఇద్దరు రైతుల మృతి

పిట్లం, బతుకమ్మ : విద్యుదాఘాతంలో ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన మంగళవారం పిట్లం మండటంలోని కంబాపూర్ లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. రైతు ఆగమయ్య పొలం వద్ద వ్యవసాయ బోరు బావి మరమ్మతులు చేసేందుకు మరో ఇద్దరు రైతులు సంగం రాములు(38), ఎర్ర హనుమయ్య(55) వెళ్లారు. బోరు బావి నుంచి పైపులు బయటకు తీస్తుండగా పైనున్న 11కేవీ విద్యుత్ తీగలు తగలడంతో సంగం రాములు, ఎర్ర హనుమయ్య అక్కడిక్కడే మృతి చెందారు. ఆగమయ్య తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Two farmers die in electrocution

Two farmers die in electrocution