Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 8:06 pm Posted by : ramakrishna

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని  డిగ్రీ, సీబీసీఎస్, ఒకటవ, మూడవ, ఐదవ, సెమిస్టర్ (రెగ్యులర్), రెండవ, నాల్గవ, ఆరవ, సెమిస్టర్  (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌ల) బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లలో జరుగుతున్నాయి. తొమ్మిదవ  రోజు ఉదయం జరిగిన పరీక్షలకు 5317 మంది విద్యార్థులకుగాను 5068  మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 249 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు  5799 మంది విద్యార్థులకు గాను ఉండగా 5314 మంది విద్యార్థులు హాజరు కాగా 483 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్మూర్ లోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని  ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ తెలిపారు.