Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 7:31 pm Posted by : ramakrishna

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి రెండు రోజుల  జైలు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలను నడిపిన ఐదుగురికి రెండు రోజుల జైలు, ఒక్కరికి ఒక్కరోజు జైలు శిక్ష పడిందని నిజామాబాద్ ఎసిపి రాజా వేంకట రెడ్డి తెలిపారు. శివ తాండాకు చెందిన కేతావత్ సంతోష్, ముల్లంగికి చెందిన షేక్ జీయా వుద్ధిన్, మద్దేపల్లికి చెందిన విశ్వనాథ్ శివరాం, పోతంగల్ కు చెందిన తోకల సంజీవ్, బోదన్ కు చెందిన బంటు శ్రీనివాస్ లు మోతాదుకు మించి మద్య సేవించి వాహనాలు నడుపడంతో అరెస్టు చేసి కోర్టులో హజరు పరుచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహన్ బేగం రెండు రోజుల చోప్పున, మెంట్రాజ్ పల్లికి చెందిన ఇసపల్లి అబ్బయ్యకు ఓక్కరోజు జైలు శిక్ష విధిస్తు తీర్పు వెలువరించగా వారందరని నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించినట్లు ఎసిపి తెలిపారు.