Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 1:35 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు

నిజామాద్, బతుకమ్మ :  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి న్యాయమూర్తి  రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఐదో టౌన్ ఎస్సై M.గంగాధర్ తెలిపారు.  ఐదో టౌన్ పరిధిలో సోమవారం పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.  నగరానికి చెందిన బుద్దరాంబాబు అనే వ్యక్తి పట్టుబడడంతో కేసు నమోదు చేశారు. అతడిని మంగళవారం నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. న్యాయమూర్తి  అతడికి రెండు రోజలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.