Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 6:04 pm Posted by : ramakrishna

ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన సిబ్బంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కొంతకాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ రావడంతో పోలీస్ సిబ్బందిలో ఆనందం వ్యక్తమైంది.

 

Two constables promoted to Head Constable.

 

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పదోన్నతి పొందిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నంబర్ 346 కె.ఎస్. శ్రీనివాస్, కానిస్టేబుల్ నంబర్ 1756 జి. అబ్బులకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది.

 

Two constables promoted to Head Constable.