Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2025, 9:32 pm Posted by : ramakrishna

కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్  పట్టణంలోని వేంకటేశ్వర కాలనీ ఆలయ ప్రాంతంలో బుధవారం సాయంత్రం హన్సిక అనే బాలికపై కుక్కలు దాడిచేశాయి. బాలిక ఆడుకుంటుండగా అవి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలికను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్​కు తరలించాలని వైద్యులు సూచించారు. హన్సికతో పాటు యోగేశ్వర్ కాలనీకి చెందిన మరో బాలుడిపై కూడా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మూర్లో కుక్కలు ప్రతి వార్డులలో విపరీతంగా ఉంటున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. బయటికి పిల్లలు వెళ్లడానికి భయపడుతున్నారు.

Two children were seriously injured in the dog attack