ప్యారడైజ్ ఫ్లైఓవర్‌పై రెండు కార్లు ఢీ..

భారీగా ట్రాఫిక్ జామ్ సికింద్రాబాద్‌,బతుకమ్మ : సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ ఫ్లైఓవర్ పైకి వేగంగా దూసుకెళ్లిన ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు డివైడర్‌పైకి దూసుకొచ్చి ఆగి ఉన్న ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. రెండు కార్లు ఢీకొనడంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.