Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2025, 4:36 pm Posted by : ramakrishna

రెండు కార్ల ఢీ : ముగ్గురి దుర్మరణం

= వికారాబాద్ జిల్లాలో ఘటన

కొడంగల్, బతుకమ్మ : రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈఘటన  వికారాబాద్ జిల్లా కొడంగల్ లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో వెళ్లారు. దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా చిట్లపల్లి- యాలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.