Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 5:53 pm Posted by : ramakrishna

ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్

. . . 5 ద్విచక్రవాహనాలు స్వాధీనం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలో జరుగుతున్న మోటార్ సైకిల్ చోరీలను అరికట్టేందుకు టౌన్ 1 పోలీసులు ప్రత్యేక పహారా పర్యవేక్షణ లో ఇద్దరు దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఎస్ హెచ్ ఓ కథనం ప్రకారం  ఇటివల ఒకటవ టౌన్ ఏరియా లో జరిగిన వరుస బైక్ దోంగతనాల నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్,ఇంటెలిజెన్స్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసి పేట్ కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా అడ్లూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ హనీఫ్ లను అరెస్టు చేసినట్టు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో ఐదు బైక్ దోంగతనాల కేసులకు సంబంధించిన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని కోర్టులో హాజరు పరుచగా న్యాయమూర్తి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. నగరంలో  దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు పహారా, పర్యవేక్షణ, ప్రత్యేక దర్యాప్తు చర్యలు మరింత బలోపేతం చేస్తున్నట్టు  ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. వాహనాలకు పటిష్టమైన లాక్స్ ఉపయోగించాలని, అనుమానాస్పద వ్యక్తుల గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.