ఇందూర్, బతుకమ్మ: ఐఎన్టియుసి 327 యూనియన్ కు సంబంధించి 2024 ఇయర్ బెస్ట్ లీడర్ అవార్డ్ తో పాటు బెస్ట్ ఫైనాన్సియల్ సపోర్ట్ అవార్డ్ నిజామాబాద్ జిల్లాకు వరించాయి. ఈ పురస్కారాలను అల్ ఇండియా అద్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ చేతుల మీదుగా జిల్లా అద్యక్షుడు కె.వేణుగోపాల్ రావు, కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా ప్రాంతీయ కార్యదర్శి పూదరి గంగాధర్ అందుకున్నారు. పని తీరును అనుసరించి నిజామాబాద్ కు రెండు అవార్డ్ లకు ఎంపిక చేసి జ్ఞాపికలను అందజేసిన జాతీయ, రాష్ట్ర నాయకులకు యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
