నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు ఎఏస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి లభించింది. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు రుద్రూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఎస్ .రాజు, సి.సి.ఎస్ ఏఎస్ఐ చవాన్ బీంరావులకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అభినంధించారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న ఏఎస్ ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన అధికారులకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
